ChandraBabu: గూగుల్ రావడం ఒక గేమ్ చేంజర్..! 11 d ago
సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల రెండవ సదస్సు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర శాఖల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గూగుల్ ప్రతనిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో సంస్థ కార్యకలాపాల నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా గుగుల్ సంస్థ విశాఖపట్టణంలో తన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదొక చరిత్రగా అభివర్ణించారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అమెరికా వెళ్లినప్పుడు గూగుల్ క్యాంపస్‌కి వెళ్లి వారితో మాట్లాడారన్నారు. దీంతో విశాఖపట్టణానికి గూగుల్ కంపెనీ వచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. కంపెనీ ప్రతినిధులు సర్వే చేసుకుని, విశాఖపట్టణం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా గుర్తించి, పెట్టుబడులకు ఓకే చెప్పారన్నారు. గూగుల్ సంస్థ ఇక్కడికి వస్తే అది ఒక గేమ్ చేంజర్ అవుతుందన్నారు.
డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్‌ను అనుసంధానం చేసి గూగుల్ సేవలను వినియోగించుకుంటే.. ఇదొక స్ట్రాటజిక్ ప్రాంతం అవుతుందని పేర్కొన్నారు. దీనిని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయలనుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎంత హార్డ్ వర్క్ చేశామన్నది ముఖ్యం కాదని, ఎంత స్మార్ట్ వర్క్ చేశామన్నదే ముఖ్యమన్నారు. ఒకప్పుడు తాను ఐటీ గురించి మాట్లాడానని, ఆ తర్వాత ఏఐ గురించి చెప్పానన్నారు. కానీ, ఇప్పుడు డీప్ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటినీ ఉపయోగించి రియల్ టైమ్ గవర్ననెన్స్ అందిస్తే... చాలా మార్పలొస్తాయన్నారు. ఇందుకు ఉదాహరణగా.. విశాఖపట్నంలోని ఏజెన్సీ ఏరియాలో గంజాయి నిర్మూలనను వివరించారు. గూగుల్ ద్వారా శాటిలైట్‌తో గంజాయి సాగును విస్తీర్ణానాన్ని గుర్తించి, డ్రోన్లను క్షేత్ర స్థాయికి పంపించి గంజాయి పంటను నాశనం చేయొచ్చని వివరించారు.